టాలీవుడ్ మన్మథుడు విలన్ గా మారుతున్నాడా? - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 1 October 2015

టాలీవుడ్ మన్మథుడు విలన్ గా మారుతున్నాడా?


మన టాలీవుడ్ లో ప్రయోగాలు చేయటానికి ఎప్పుడు సిద్దంగా ఉండే కింగ్ నాగార్జున మరో కొత్త అవతారంలో కనపడటానికి సిద్దం అయినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే నాగార్జున వేసే కొత్త అవతారం ఏమిటో మీకు తెలుసా? నాగార్జున నెగిటివ్ రోల్ వేయటానికి సిద్దం అయ్యాడు. తమిళంలో జయం రవి హీరోగా వచ్చిన 'తని ఒరువన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకమైనది.

తమిళ సినిమాలో ఒకప్పట్టి అందాల హీరో అయిన అరవింద్ స్వామి విలన్ గా  చేసి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో అరవింద్ స్వామి చేసిన పాత్రను తెలుగులో నాగార్జున చేస్తాడనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే  'అన్నమయ్య,శ్రీ రామదాసు,షిరిడి సాయి వంటి విభిన్నమైన సినిమాలను చేసిన నాగార్జున ఒక ఫవర్ ఫుల్ విలన్ గా కూడా నటించి మెప్పించాలని ఆరాటపడుతున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రకు నాగార్జున కంటే ముందుగా చాలా పేర్లు వినిపించాయి.
మొదట తమిళంలో చేసిన అరవింద్ స్వామినే తీసుకుందామని భావించారు. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి రానా వచ్చి చేరాడు. ఆ తర్వాత విలన్ పాత్రపై చెర్రీ మోజు పడుతున్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ లిస్టు లో మన్మధుడు చేరాడు. అయితే ఈ విషయం మీద ఒక క్లారిటి రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
టాలీవుడ్ మన్మథుడు విలన్ గా మారుతున్నాడా? Reviewed by Unknown on 04:21 Rating: 5 మన టాలీవుడ్ లో ప్రయోగాలు చేయటానికి ఎప్పుడు సిద్దంగా ఉండే కింగ్ నాగార్జున మరో కొత్త అవతారంలో కనపడటానికి సిద్దం అయినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం...

No comments: