'టెంపర్' సినిమా హిట్ అయ్యినా సరే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ రేసులో వెనకపడిపోయింది కాజల్. టెంపర్ సినిమాతో విజయాన్ని అందుకున్న మరో చాన్స్ పట్టటానికి దాదపుగా ఎనిమిది నెలల సమయం పట్టింది. ప్రస్తుతం కాజల్ తన బండిని పట్టాలెక్కించి స్టార్ హీరోలతో నటించటానికి సిద్దం అయ్యిపోయింది. మొదట ప్రిన్స్ మహేష్ సరసన 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిట్ అయ్యిన ఈ భామ ఆ తర్వాత పవర్ స్టార్ తో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇప్పుడైతే ఇక మెగా పవర్ స్టార్ తో కూడా నటించటానికి రెడీ అయ్యిందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో హాల్ చల్ చేస్తున్నాయి. నిర్మాత దానయ్య రామ చరణ్ హీరోగా తమిళంలో హిట్ అయ్యిన 'తన్ని ఒరువన్' సినిమాను సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో రీమేక్ చేయటానికి సన్నాహాలను చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ అయిన కాజల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. అంతేకాక సెంట్ మెంట్ ని ఎక్కువగా ఫాలో అయ్యే రామ్ చరణ్ తన లక్కీ హీరోయిన్ అయిన కాజల్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.


No comments: