శ్రీమంతున్ని మించిన భామ. - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 1 October 2015

శ్రీమంతున్ని మించిన భామ.



కమల్ హసన్ కూతురిగా సినీ రంగానికి పరిచయం అయిన శృతి హసన్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన కెరీర్  ప్లాప్స్ తో ప్రారంభం అయినా చాలా తొందరిగానే దాని నుంచి బయట పడి సక్సెస్ బాట పట్టింది. పవర్ స్టార్ తో నటించిన 'గబ్బర్ సింగ్' సినిమాతో ఆమె వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశమే లేకపోయింది. ప్రస్తుతం శ్రీమంతుడు హిట్ తో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

సాదారణంగా దక్షిణాదిన హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కి క్రేజ్ తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు శృతి దాన్ని బ్రేక్ చేసేసింది. అయితే ఆమె పారితోషికం,కలెక్షన్ల పరంగా కాకుండా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో స్టార్
హీరోలందరిని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పటివరకు ట్విట్టర్ లో 15 లక్షల ఫాలోవర్స్ తో టాప్ పొజిషన్ లో ఉన్న మహేష్ బాబుని దాటేసి 30 లక్షల ఫాలోవర్స్ తో శృతి ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం  'పులి' తో సందడి చేస్తున్న శృతి తమిళంలో ఒక సినిమా,హిందీలో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఈ విధంగా ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియా లో కూడా దూసుకుపోతుంది.

శ్రీమంతున్ని మించిన భామ. Reviewed by Unknown on 04:08 Rating: 5 కమల్ హసన్ కూతురిగా సినీ రంగానికి పరిచయం అయిన శృతి హసన్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తన కెరీర్  ప్లాప్స్ తో ప్రార...

No comments: