బుల్లితెరపైనా భాయిజాన్ వంద కోట్లను కొల్లగొడుతుందా? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 20 October 2015

బుల్లితెరపైనా భాయిజాన్ వంద కోట్లను కొల్లగొడుతుందా?


ఒకవైపు బుల్లితెరపై రావటానికి 'బాహుబలి' సిద్దం అవుతుంటే మరోవైపు 'బజరంగీ భాయిజాన్' బుల్లితెరలో వచ్చి సంచలనాలను సృష్టించింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు కథను అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. 'బజరంగీ భాయిజాన్' సినిమా మొన్న ఆదివారం టివిలో ప్రసారం అయ్యి కాసుల వర్షాన్ని కురిపించింది. బుల్లితెరలో ప్రసారం అయిన ఈ సినిమాకు యాడ్స్ రూపంలో అక్షరాలా అరవై కోట్ల రూపాయలు వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా మొదటి సారి టెలికాస్ట్ చేసినప్పుడే 60 కోట్లు వస్తే రెండో సారి టెలికాస్ట్ చేసినప్పుడు సుమారుగా 50 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే బుల్లితెరపై కూడా వంద కోట్ల క్లబ్ అనే మాట వినిపిస్తుంది. ఈ సినిమాకు అమెజాన్ ఇండియా, ఆస్క్ మి డాట్ కాం వంటి సైట్స్ భారీ స్థాయిలో యాడ్స్ ఇచ్చాయి. ఇదే ఇన్ని సంచలనాలను నమోదు చేస్తే 'బాహుబలి' ఎన్ని సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.
బుల్లితెరపైనా భాయిజాన్ వంద కోట్లను కొల్లగొడుతుందా? Reviewed by Unknown on 02:49 Rating: 5 ఒకవైపు బుల్లితెరపై రావటానికి 'బాహుబలి' సిద్దం అవుతుంటే మరోవైపు 'బజరంగీ భాయిజాన్' బుల్లితెరలో వచ్చి సంచలనాలను సృష్టించింది. ఇ...

No comments: