'అఖిల్' ప్రచారం ఎప్పుడు....ఎలా? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 20 October 2015

'అఖిల్' ప్రచారం ఎప్పుడు....ఎలా?


ఒక వైపు ' రుద్రమదేవి' హిట్ టాక్ తో ముందుకు దూసుకు పోతుంటే, మరో పక్క 'బ్రూస్ లీ' సినిమా ప్రమోషన్స్ షురూ చేసేసారు. ఆ తర్వాత వచ్చే 'అఖిల్' పరిస్థితి ఏమిటి? ఇప్పటివరకు అఖిల్ ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతాయో అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున ప్రమోషన్స్ ని పక్కా ప్లానింగ్ తో చేయటానికి ప్లాన్ చేసాడు. ఎందుకంటే ఈ సినిమా మీద అఖిల్ తో పటు నాగ్ కూడా ఎన్నో ఆశలను పెట్టుకున్నాడు. 'బ్రూస్ లీ' సినిమా విడుదల అయిన వెంటనే ప్రమోషన్స్ లోకి నాగ్ తో పాటు నాగ చైతన్య, అమల కూడా రంగంలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను అత్యంత భారీగా చేసి అక్కడి నుంచే ప్రమోషన్స్ ప్రారంభించాలని ప్లాన్ చేసాడు నాగార్జున. మన్మధుడు తన కొడుకు సినిమా ప్రమోషన్ కార్యక్రమంను చాలా పక్కాగా ప్లాన్ చేసాడు.
'అఖిల్' ప్రచారం ఎప్పుడు....ఎలా? Reviewed by Unknown on 23:38 Rating: 5 ఒక వైపు ' రుద్రమదేవి' హిట్ టాక్ తో ముందుకు దూసుకు పోతుంటే, మరో పక్క 'బ్రూస్ లీ' సినిమా ప్రమోషన్స్ షురూ చేసేసారు. ఆ తర్వాత వచ...

No comments: