రానా రుద్రమదేవి లో ఎందుకు ఎలివేట్ కాలేదు? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 10 October 2015

రానా రుద్రమదేవి లో ఎందుకు ఎలివేట్ కాలేదు?

రానా రుద్రమదేవి లో ఎందుకు ఎలివేట్ కాలేదు?

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో రానా ఎలివేట్ కాలేదనే కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ తో రానా షాక్ తిన్నాడు. అయితే ప్రేక్షకులు బాహుబలి లో భల్లాల దేవా స్థాయిలో ఉంటుందని ఊహించుకొని సినిమాను చూడటం వలన ఈ ఇబ్బంది వచ్చింది. అంతేకాక గుణశేఖర్ కూడా ఈ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కువగా అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
ఈ పాత్రను ఫోకస్ చేయటానికి రానా పోషించిన చాళుక్య వీరభద్రుడు పాత్రను చివరి నిమిషంలో ఎడిటింగ్ లో కట్ చేసెసాడట. కొంతమంది రానా ఇటువంటి ప్రాధాన్యత లేని పాత్రను ఎలా ఒప్పుకున్నాడని అంటున్నారు. ‘రుద్రమదేవి’లో మంత్రిగా ప్రకాశ్ రాజ్, మహారాజుగా కృష్ణంరాజు, నెగిటివ్ షేడ్స్‌లో సుమన్ పాత్రల ముందు రానా పాత్ర తేలిపోయింది. అంతేకాక గుణశేఖర్ రుద్రమదేవి పాత్ర కన్నా గోన గన్నారెడ్డి పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. మొత్తం మీద రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సినిమా చేయుట వలన రానాకిం ఒరిగింది ఏమి లేదని చెప్పవచ్చు.
రానా రుద్రమదేవి లో ఎందుకు ఎలివేట్ కాలేదు? Reviewed by Unknown on 11:08 Rating: 5 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో రానా ఎలివేట్ కాలేదనే కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ తో రానా షాక్ తిన్నాడు. అ...

No comments: