అమరావతిలో బాలయ్య సందడి చేయనున్నారా? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 10 October 2015

అమరావతిలో బాలయ్య సందడి చేయనున్నారా?


ఈ రోజుల్లో సినిమాని ఎంత విబిన్నంగా ప్రజెంట్ చేస్తే అంత జనాలకు ఎక్కుతుంది. అందుకే సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ప్రేక్షకుల దృష్టిలో పడటానికి ఎన్నో పాట్లను పడుతున్నారు. ఇప్పుడు  ‘డిక్టేటర్’ టీమ్ కూడా సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి విబిన్నంగానే అడుగులు వేస్తుంది. ప్రస్తుతం వస్తున్న తాజా సమాచారం ప్రకారం  ‘డిక్టేటర్’ ఆడియో వేడుకలను అమరావతిలో జరపాలని నిర్ణయం తీసుకున్నారట. బాలయ్య అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో రాజకీయంగా చూసినా సరే అమరావతిలో ఆడియో వేడుకను జరిపితే బాగుంటుందని అంటున్నారు. అలాగే బాలయ్య బాబుకి తెలంగాణా కంటే అభిమానులు ఆంధ్రప్రదేశ్,సీడెడ్ లోనే ఎక్కువగాఉన్నారు . పైగా బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి MLA  గా ఉన్నారు. ఇటు రాజకీయంగా చూసుకున్నా అటు సినిమాల పరంగా చూసుకున్నా అమరావతి వేదిక చాలా బాగుంటుందనే మాటలు విన్పిస్తున్నాయి. ఈ ఆడియో వేడుక అమరావతిలో ఓపెన్ వేదిక మీద జరపాలని అనుకుంటున్నారు. డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో జరపాలని ప్లాన్ చేస్తున్నారు.
అమరావతిలో బాలయ్య సందడి చేయనున్నారా? Reviewed by Unknown on 11:11 Rating: 5 ఈ రోజుల్లో సినిమాని ఎంత విబిన్నంగా ప్రజెంట్ చేస్తే అంత జనాలకు ఎక్కుతుంది. అందుకే సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ప్రేక్షకుల దృష్టిలో పడటాన...

No comments: