" కెసిఆర్ మీద యువత బాహుబలి లాగా తిరగబడతారు " - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 21 August 2015

" కెసిఆర్ మీద యువత బాహుబలి లాగా తిరగబడతారు "



గతం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ఉమ్మడి ఆంద్ర ప్రాంతానికి డిప్యూటీ సి ఎం గా చేసిన దామోదర నరసిహ్మ ఇన్నాళ్ళ తరావాత మీడియా ముందర కి వచ్చారు. మెదక్ లోని తన సొంత నియోజికవర్గం లో 2014 లో దారుణంగా ఓడిపోయినా ఆయన నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి తరహా లోనే కనుమరుగు అయ్యారు. ఇన్నాళ్ళ తరవాత మీడియా ముందర కు వచ్చిన ఆయన తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ మీద నిప్పులు చేరిగారు . " పూట పూటకూ కొత్త మాటలతో , ఆ పూట గడిపేసే మాటలు చెబుతున్న కెసిఆర్ గారడీ ని యువకులు బాహుబలి లాగా తిరగబడి బారీ నడ్డి విరగ్గోడతారు అని , తెరాస గెలిస్తే దళిత ముఖ్య మంత్రి వస్తాడు అని బహిరంగ సభలో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు " అని ప్రశ్నించారు . కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ని రద్దు చేసి తెలంగాణా యువత కి ఏడాది లోగ లక్ష ఉద్యోగాలు ఇస్తాము అన్న హామీ ఏమయ్యింది అని ఆయన అడిగారు.
" కెసిఆర్ మీద యువత బాహుబలి లాగా తిరగబడతారు " Reviewed by Unknown on 21:15 Rating: 5 గతం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ఉమ్మడి ఆంద్ర ప్రాంతానికి డిప్యూటీ సి ఎం గా చేసిన దామోదర నరసిహ్మ ఇన్నాళ్ళ తరావాత మీడియా ముందర...

No comments: