బాలయ్య కి మాస్ జనాల్లో ఉండే క్రేజ్ అంత ఇంత కాదని చెప్పాలి. బాలయ్య లాగ మీసాలు పెంచి మరి బాలయ్య ని ఇమిటేట్ చేస్తుంటారు. ఇక తాజా గా బాలయ్య టాటూలు బాగా ఫేమస్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే , నాని తన కొత్త సినిమా " కృష్ణ గాడి వీర ప్రేమ గాధ "లో బాలయ్య అభిమాని గా నటించాడు. ఈ సినిమాలో నాని చేతికి " జై బాలయ్య " టాటూ ఉంటుంది.
ఈ టాటూ లను 14 రీల్స్ వారు బాలయ్య ఫాన్స్ కోసం చేతికి వెయ్యడం కూడా మొదలు పెట్టారు. ప్రతి బాలయ్య ఫాన్స్ ఈ టాటూలు వేయిన్చికొని ఫేస్బుక్ ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తున్నారు. కాని ఈసారి విచిత్రంగా అమ్మాయిలు కూడా " జై బాలయ్య " టాటూలు వేసుకోడం విశేషం. అమ్మాయిలలో కూడా బాలయ్య అభిమానులు ఉంటారు కాని ఈ రేంజ్ లో హాల్ చల్ చెయ్యడమే ఇదే తొలిసారి అని చెప్పాలి. ఏది ఏమైనా నాని కూడా బాలయ్య పేరు ని సినిమా లో బాగా వాడుకున్నాడు అని చెప్పాలి. మొత్తానికి బాలయ్య తన క్రేజ్ తో ట్రెండ్ సృష్టించాడని చెప్పాలి.


No comments: