కామెడీ దర్శకుడు శ్రీను వైట్ల కి కష్ట కలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగు , బ్రూస్ లీ సినిమాలు ఫ్లాపులు అయ్యాక , వైట్ల ని అందరు హీరోలు దూరం పెట్టేసారు. తాజా గా వైట్ల రవి తేజ తో సినిమా చెయ్యడానికి చాల ప్రయత్నాలు చేసాడు , కాని కాల్ షీట్స్ లేవని రవి తేజ తప్పుకున్నట్లు తెలుస్తుంది.
మంచు విష్ణు తో కూడా సినిమా చెయ్యడానికి వైట్ల ప్రయత్నించినట్లు సమాచారం. ఈ మధ్యనే మహేష్ బాబు ని కలిసి ఒక కథ చెప్పాడంట వైట్ల , కాని మహేష్ బాబు ఈ కథ ని సుదీర్ బాబు తో తీస్తే తనే నిర్మిస్త అని షాక్ ఇచ్చాడట. సుహీర్ బాబు తో సినిమా ఇష్టం లేక అక్కడ నుండి చల్లగా జారుకున్నట్లు సమాచారం. ఇక ఈ మధ్యనే రెడీ హీరో రామ్ కి కూడా ఒక కథ చెపినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.అయితే , రామ్ కి వైట్ల కి రెడీ సినిమా అప్పుడు చిన్నపాటి గొడవలు అయ్యాయి , అందుకే రామ్ కూడా ఆలోచిద్దాం అని వైట్ల ని తిప్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా వైట్ల ని మాత్రం అందరు ఆడుకుంటున్నారు .


No comments: