బాలకృష్ణ 100 సినిమా గురించి చాల పెద్ద చర్చ జరుగుతుంది. బాలయ్య తన 100 సినిమా సింగీతం తో తీస్తున్న అని ఇప్పటికే ప్రకటించాడు కాని తాజా సమాచారం ప్రకారం , బాలయ్య బోయపాటి తోనే సినిమా చెయ్యడానికి ఆసక్తి గా ఉన్నాడు. ఇంకో వైపు బోయపాటి తన తదుపతి చిత్రం బెల్లం కొండ శ్రీనివాస్ తో కమిట్ అయ్యాడు.
ఈ విషయం మీద బాలయ్య 14 రీల్స్ వారితో మాట్లాడి , బోయపాటి ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసాడు కాని బెల్లం కొండ మాత్రం తనకు బోయపాటి కావాలని తెగేసి చెప్పినట్లు సమాచారం. బెల్లం కొండ శ్రీను తాజా చిత్రం స్పీడున్నోడు భారి ఫ్లాప్ గా నిలిచింది , అందుకే 3 వ చిత్రం బోయపాటి తో ఉంటేనే మంచిదని బెల్లంకొండ భావిస్తున్నాడు.
ఇంకో వైపు బాలయ్య అభిమానులు , సన్నిహితులు బోయపాటి అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య 100 సినిమా కోసం బెల్లం కొండ తగ్గుతదో లేదో చూడాలి.


No comments: