పవన్ కళ్యాణ్ శైలి ఇప్పుడున్న హీరోల తో పోలిస్తే విభిన్నం అని చెప్పాలి . ఇప్పటి వరకు చాల రకాల పాత్రలు వేసిన పవన్ కళ్యాణ్ కి చాల రకాల టాలెంట్లు ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కంపోజ్ చెయ్యడం , పాటలు పడటం , పాటలు రాయడం స్క్రీన్ ప్లే ఇలా అన్ని విషయాల్లో పట్టు ఉన్న కథ నాయకుడు పవన్ కళ్యాణ్.
జాని సినిమా కి స్క్రీన్ ప్లే అందించిన పవన్ కళ్యాణ్ , తన సినిమాల విషయం లో ఎంతో కొంత కథ లో చేయి పెట్టె పవన్ కళ్యాణ్ ఈ సరి సర్దార్ గబ్బర్ సింగ్ కి స్క్రిప్ట్ లో బాగానే వేలు పెట్టాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన సీన్స్ చాల మందికి నచ్చాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. దర్శకుడు బాబీ పవన్ కళ్యాణ్ పేరు ని స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ పర్యవేక్షణ అని వేపిస్తాను అని పవన్ కళ్యాణ్ ని పర్మిషన్ అడిగినట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే , సినిమా టైటిల్స్ లో స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వ పర్యవేక్షణ పవన్ కళ్యాణ్ అని చూడొచ్చు. మొత్తానికి ఈ సినిమా వరకు పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకం.


No comments: