జాగ్రత్త పడుతున్న రాజ్ తరుణ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 18 February 2016

జాగ్రత్త పడుతున్న రాజ్ తరుణ్


జాగ్రత్త పడుతున్న రాజ్ తరుణ్



తెలుగు పరిశ్రమ లో హీరో గా ఎదగాలంటే మాములు విషయం కాదు.కుర్ర హీరోలు ఒక్క సినిమా ఫ్లాప్ కొడితే మళ్ళి కోలుకోవాలంటే చాల సమయం పడుతుంది. ఇక ఈ మధ్యన ట్రెండ్ మారి , షార్ట్ ఫిల్మ్స్ లో పాపులర్ అయిన వాళ్ళు హీరోలుగా మన ముందుకు వస్తున్నారు. ఈ ట్రెండ్ ని సృష్టించింది మరెవరో కాదు రాజ్ తరుణ్.

మొదటి సినిమా తోనే ఫుల్ మార్క్స్ కొట్టేసిన రాజ్ తరుణ్ , ఆ తర్వాతి సినిమాల్లో కూడా జోరు తగ్గించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. కుమారి 21 ఎఫ్ లో బాలన్స్ గా నటించి తన సత్తా చాటాడు.అయితే ఈ మధ్యనే విడుదల అయిన సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు సినిమా రాజ్ తరుణ్ కెరీర్ లోనే ఫస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.

ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన రాజ్ తరుణ్ కి ఈ సినిమా చేదు అనుభవం గా మిగిలింది. ఈ విషయాన్నీ గాట్టిగా మనసులో పెట్టుకున్న రాజ్ తరుణ్, ఇక నుండి స్క్రిప్ట్ విషయం లో చాల జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట.రామ్ గోపాల్ వర్మ తో చేసే సినిమా కూడా కాన్సిల్ చేస్తా అని సన్నిహితుల దగ్గర చెప్తున్నాడట. ప్రస్తుతానికి మంచు విష్ణు సినిమా లో బిజీ గా ఉన్న రాజ్ తరుణ్ ఇక ముందు మంచి హిట్స్ కొడతాడని ఆశిద్దాం.
జాగ్రత్త పడుతున్న రాజ్ తరుణ్ Reviewed by Unknown on 09:21 Rating: 5 తెలుగు పరిశ్రమ లో హీరో గా ఎదగాలంటే మాములు విషయం కాదు.కుర్ర హీరోలు ఒక్క సినిమా ఫ్లాప్ కొడితే మళ్ళి కోలుకోవాలంటే చాల సమయం పడుతుంది. ఇక...

No comments: