అందాల తార అనుష్క , ఇప్పుడు సినిమాలు సైన్ చేసే విషయం లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా బాహుబలి తో మంచి పేరు సంపాదించినా అనుష్క , ఆ తర్వాత రుద్రమ దేవి , సైజు జీరో , వర్ణ పరాజయం తో కొంత నిరాశలో ఉందట. అరుంధతి సినిమా తర్వాత తను ప్రధాన పాత్రల్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలిచాయి.
రుద్రమదేవి సినిమా లో తన పాత్ర కంటే అల్లు ర్జున్ పాత్ర హైలైట్ అవ్వడం కూడా ఒక విధంగా అనుష్క కి డ్యామేజ్ అయ్యింది.. మొత్తానికి అనుష్క ఇక నుండి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యనని తెగేసి చెప్పిందట.తన వాళ్ళ నిర్మాతలు నష్టపోవడం తనకి ఇష్టం లేదని , హీరోయిన్ గా గ్లామర్ పాత్రలు చేసుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తాను అని సన్నిహితుల దగ్గర చెప్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే ఇద్దరు ముగ్గురు ఫిమేల్ ఓరియెంటెడ్ కథలతో వస్తే , నా వాళ్ళ కాదని తిప్పి పంపినట్లు సమాచారం.
బడ నిర్మాతలు కూడా అనుష్క ఇచ్చిన ఝలక్ చూసి షాక్ అయ్యారట మొత్తానికి అనుష్క మాత్రం అలాంటి పాత్రలు చేయనని చెప్పేసింది.


No comments: