నాగ చైతన్య ప్రస్తుతానికి ప్రెమమ్ సినిమా రీమేక్ లో బిజీ గా ఉన్నాడు.గోవా లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమా కి ముందుగా మజ్ను అనే టైటిల్ అనుకున్నారు కాని తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కి ప్రెమమ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.
70 % పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చేయనున్నారు. చైతన్య హీరో గా 12 వ సినిమా చేస్తున్నాడు. మలయాళం వెర్షన్ లో నటించిన అనుపమ, పరమేశ్వరం ఈ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. శ్రుతి హసన్ మలర్ పాత్ర ని చేస్తున్నారు.
కార్తికేయ ఫేం చందు ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకటేష్ , నాగార్జున కొన్ని ముఖ్యమైన పాత్రలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి , ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొంచెం ఓపిక పట్టాల్సిందే. ఏది ఏమైనా ప్రెమమ్ తెలుగు రీమేక్ కోసం ప్రెమమ్ అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు.


No comments: