నందమూరి వంశం లో నట వారసుడు ఎవరు అనే పోరు సంక్రాంతికి ముందు నుండి మొదలు అయ్యింది. ఎన్టీఆర్ ఏ వారసుడు అని హరి కృష్ణ " నాన్నకు ప్రేమతో " ఆడియో కి వచ్చి మరి చెప్పడం విశేషం. ఇక బాలయ్య , తనే వారసుడిని అని , తన తర్వాత తన కొడుకు మనుమడే తనకు పోటి అని కుండ బద్దలు కొట్టాడు.
సంక్రాంతి వార్ కి బాలయ్య , ఎన్టీఆర్ ఎవ్వరు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా సై అంటే సై అన్నారు. ఒకానొక దశలో ఎన్టీఆర్ వెనక్కి వెళ్తాడు అని అందరు అనుకున్నారు కాని ఎన్టీఆర్ కూడా తగ్గేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసాడు. అందరు అనుకున్నట్లుగానే , రెండు సినిమాలు విడుదల అయ్యాయి ,రెండు సినిమాలకు యావరేజ్ టాక్ ఏ వచ్చింది కాని ఎన్టీఆర్ సినిమా మంచి రెవిన్యూ సాధించింది. బాలయ్య డిక్టేటర్ సినిమా పండగ వరకు పర్వాలేదు అనేలా ఆడింది కాని ఆ తర్వాత పూర్తిగా క్లోజ్ అయిపొయింది.
ఎన్టీఆర్ మాములు టాక్ తో 50 కోట్ల షేర్ ని అవలీల గా అందుకుంటే , బాలయ్య మాములు టాక్ తో 20 కోట్లు మాత్రమె చేయగలిగాడు. ఎన్టీఆర్ దెబ్బతో బాలయ్య కొంత వరకు సైలెంట్ అయ్యాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. పండగ కాబట్టి ఆ మాత్రం వచ్చాయని , లేకపోతే అవి కూడా వచ్చేవి కావని చాల మంది ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా బాలయ్య మాత్రం మాల్లో ఎన్టీఆర్ తో పోటి కి రాడు అని తేల్చేసారు జనాలు.


No comments: