కనుమరుగైన కోన వెంకట్ - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 20 February 2016

కనుమరుగైన కోన వెంకట్

కనుమరుగైన కోన వెంకట్


కోన వెంకట్ పేరు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. పెద్ద స్టార్ రైటర్ గా కోన వెంకట్ తెచ్చుకున్న పేరు అంత ఇంత కాదు. కోన వెంకట్ పేరు చెపితే సినిమా కి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. ఇక శ్రీను వైట్ల తో గొడవ అనంతరం కోన మార్క్ కి మార్కెట్ లో వాల్యూ పెరిగింది. లౌక్యం , గీతాంజలి లాంటి వరుస హిట్స్ కోన వెంకట్ రేంజ్ ని ఎక్కడికో తీసుకేల్లిపోయాయి.కాని , ఆ తర్వాత కోన వెంకట్ బాడ్ టైం స్టార్ట్ అయ్యింది , శ్రీను వైట్ల తో కలిసి బ్రూస్ లీ చెయ్యడం మొదలు , కోన కి అన్ని అపజయాలే. అఖిల్ , బ్రూస్ లీ , సౌఖ్యం, త్రిపుర , శంకర భరణం , డిక్టేటర్ ఇలా అన్ని ఫ్లాపులుగా నిలిచాయి. కోన పేరు చెబితేనే ఇండస్ట్రీ లో పెద్దలంత రొటీన్ మార్క్ అనేస్తున్నారట.

సొంత నిర్మాణం చేసుకునేంత రేంజ్ కి వచ్చిన కోన వెంకట్ అనుకోకుండా పాతాళం కి పోవడం నిజంగా దురదృష్టకరమే.ప్రస్తుతానికి ఖాళీ గా ఉన్న కోన వెంకట్ , త్వరలో ఇంకో కామెడీ హర్రర్ చెయ్యడానికి సిద్దపడుతున్నాడని తెలుస్తుంది. ఈ కామెడీ హర్రర్ లో హీరో గా ప్రభు దేవా గా నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. ఈ సినిమా కి పాతాల భైరవి అనే టైటిల్ పెట్టె అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సారి అయిన కోన మంచి హిట్ కొట్టాలని ఆశిద్దాం.
కనుమరుగైన కోన వెంకట్ Reviewed by Unknown on 06:49 Rating: 5 కోన వెంకట్ పేరు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. పెద్ద స్టార్ రైటర్ గా కోన వెంకట్ తెచ్చుకున్న పేరు అంత ఇంత కాదు. కోన వెంకట్ పేరు చెపి...

No comments: