సినిమా సినిమాకి వైవిద్యం చూపించే హీరో మహేష్ బాబు. ప్రతి సినిమా లో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించే మహేష్ బాబు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత కొంత వెయిట్ తగ్గాడు. వన్ నేనొక్కడినే సినిమా కి సిక్స్ ప్యాక్ చేసాడు మహేష్ కాని ఎక్కడ సిక్స్ ప్యాక్ ని చూపించకపోవడం విశేషం.
ఆ తర్వాత చేసిన ఆగాడు సినిమాలో అయిన సిక్స్ ప్యాక్ చుపిస్తాడని చాల మంది అభిమానులు ఎదురు చూసారు కాని కుదరలేదు. ప్రస్తుతానికి బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీ గా ఉన్న మహేష్ బాబు ,ఆ తర్వాత మురుగ దాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. తమిళ్ తెలుగు లో రానున్న ఈ సినిమా లో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు అనే వదంతులు వినిపిస్తున్నాయి. మురుగ దాస్ పాత్రకి తగ్గట్లు , సిక్స్ ప్యాక్ ఉంటె బాగుంటుందని సూచించాడు అని సమాచారం.
మహేష్ కూడా సిక్స్ ప్యాక్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇదే నిజం అయితే , ఈసారి ఫాన్స్ కి పండగ షురు అనమాట.


No comments: