ఏప్రిల్ లో పోలీసుల దండయాత్ర - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 20 February 2016

ఏప్రిల్ లో పోలీసుల దండయాత్ర

ఏప్రిల్ లో పోలీసుల దండయాత్ర


ఏప్రిల్ లో పోలీసుల దండ యాత్ర ఏంటి అని ఆలోచిస్తున్నారా . అవునండి , ఏప్రిల్ లో వస్తున్న సినిమాలు అన్ని పోలీస్ స్టోరీలే. వివరాల్లోకి వెళితే , ఏప్రిల్ లో మన తెలుగు సినిమాలే , కాక తమిళ్ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తిగా పోలీస్ కథ , సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ కి కొనసాగింపుగా వస్తుంది.

పవర్ దర్శకుడు బాబీ ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక అటు ఇటు గా అల్లు అర్జున్ " సరైనోడు " కూడా అప్పుడే విడుదల అవుతుంది. మాస్ దర్శకుడు బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద కూడా భారి అంచనాలే ఉన్నాయి. మెగా ఫ్యామిలి ని నుండి కొత్తగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ " సుప్రీమ్ " కూడా అదే సమయం లో విడుదల కానుంది. ఈ సినిమాను ఏప్రిల్ 1 న విడుదల చేస్తామని , ఇప్పటికే దిల్ రాజు ప్రకటించాడు.

ఈ మూడు సినిమాలే కాకుండా , విజయ్ నటించిన తమిళ్ ఫిల్మ్ " తేరి " కూడా అదే నెల లో రానుంది. రాజ రాణి దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న " తేరి " మీద తెలుగు లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఏప్రిల్ లో నాలుగు పోలీస్ కథలతో బాక్స్ ఆఫీసు హోరేత్తనుంది.
ఏప్రిల్ లో పోలీసుల దండయాత్ర Reviewed by Unknown on 08:23 Rating: 5 ఏప్రిల్ లో పోలీసుల దండ యాత్ర ఏంటి అని ఆలోచిస్తున్నారా . అవునండి , ఏప్రిల్ లో వస్తున్న సినిమాలు అన్ని పోలీస్ స్టోరీలే. వివరాల్లోకి వెళి...

No comments: