కళ్యాణ్ రామ్ హీరో గా నిర్మతాగానే చాల మందికి తెలుసు కాని కళ్యాణ్ రామ్ కి ఒక వి ఎఫ్ ఎక్స్ కంపెనీ ఉందని చాల మందికి తెలిదు. ఓం 3 డి సినిమా నుండి స్థాపించిన ఈ సంస్థ పేరు అద్వైత . నాన్నకు ప్రేమతో , సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ , లెజెండ్ , పటాస్ ఇలా చాల తెలుగు సినిమాలకు అద్వైత సంస్థ వారు గ్రాఫిక్స్ వర్క్ చేసారు.
కళ్యాణ్ రామ్ గ్రాఫిక్స్ కంపెనీ కి మంచి డిమాండ్ ఏర్పడటమే కాదు కాసుల వర్షం కురుస్తుందట. కళ్యాణ్ రామ్ బిజినెస్ మైండ్ మాములుగా ఉండదని పరిశ్రమ లో చాల మంది చెప్పుకుంటారు , ఇప్పుడు ఈ కంపెనీ పెరుగుతున్న తీరు చూస్తుంటే కళ్యాణ్ రామ్ ని మెచ్చుకోక తప్పదు.ఈ వి ఎఫ్ ఎక్స్ కంపెనీ ని బాలీవుడ్ కి కూడా విస్తరించాలని కళ్యాణ్ రామ్ గట్టిగానే ప్లాన్స్ వేస్తున్నాడు.
ఇంకో వైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద రెండు సినిమాలు నిర్మించనున్నాడు. ఒక సినిమా కళ్యాణ్ రామ్ నటిస్తుండగా ఇంకో సినిమాలో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.మొత్తానికి కళ్యాణ్ రామ్ తన వ్య్పరలతో పాటు సినిమాలలో కూడా దూసుకేలుతున్నాడు .


No comments: