నాగార్జున సూపర్ హిట్ సినిమా " సోగ్గాడే చిన్ని నాయన " కి సీక్వెల్ రానుంది. ఈ విషయం స్వయంగా నాగార్జున ఈరోజు ప్రెస్ కి తెలిపాడు. సోగ్గాడు విజయం మరువలేనిది అని , 100 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసి 48 కోట్ల షేర్ ని వసూలు చేసినని చెప్పాడు నాగార్జున సోగ్గాడు చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ " బంగార్రాజు " తీస్తున్నామని ,
ఆ సినిమా కి కూడా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అని చెప్పుకొచ్చాడు.తన సినిమా కంటే ముందు చైతు తో కూడా ఒక సినిమా చేస్తాడని నాగార్జున చెప్పుకొచ్చాడు. తన తదుపరి సినిమా రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ఉంటుందని , ప్రస్తుతానికి ఊపిరి సినిమా ప్రమోషన్లలో బిజీ గా ఉన్నానని అన్నారు నాగార్జున. ఊపిరి తమిళ్ వెర్షన్ తాజా లో తన పాత్ర కి తనే డబ్బింగ్ చెప్పాడట నాగార్జున.
మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కళ్యాణ్ కృష్ణ తండ్రి కొడుకులతో సినిమాలు చేయనున్నాడు.2017 లో నాగార్జున , చైతు దాదాపు మూడు సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉంచారు. ఏది ఏమైనా అక్కినేని అభిమానులకు మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పాలి.


No comments: