మహేష్ బాబు ఫ్యామిలి నుండి వచ్చిన యంగ్ హీరో సుధీర్ బాబు. విలక్షణమైన కథలని ఎంచుకునే సుధీర్ బాబు , భలే భలే మంచి రోజు సినిమాతో మళ్ళి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతానికి ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగ నిర్మాణం లో , కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా పేరు " ఎరుపు " అని ఖరారు చేసారు.
ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటో తెలిదు కాని ఎరుపు అనే పదం మాత్రం అందరికి షాకింగ్ అని చెప్పాలి. తెలుగు లో డబల్ మీనింగ్ అర్ధం వచ్చే ఈ టైటిల్ ని పెట్టడానికి నిజంగా గట్స్ ఉండాలి.కథ ప్రకారం సినిమా కి ఇటువంటి టైటిల్ అయితేనే బాగుంటుందని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అభిప్రాయపడ్డాడు.
ఏది ఏమైనా సుధీర్ బాబు మళ్ళి కొత్త తరహ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా టిజర్ ఈ నెల 21 నా విడుదల అవ్వనుంది. సుధీర్ బాబు మరొక హిట్ కొడతాడని ఆశిద్దాం.


No comments: