నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా మీద రోజు రోజు కి ఒక్కో మలుపు తీరుగుతుంది. మొన్నటి వరకు సింగీతం శ్రీనివాస్ , బోయపాటి శ్రీను , క్రిష్ పేర్లు వినిపించాయి , ఇప్పుడు కృష్ణ వంశి కూడా ఈ లిస్టు లో చేరాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే , కృష్ణ వంశి నీ స్వయంగా బాలయ్య పిలిచి 100 వ సినిమా కి మంచి కథ సిద్ధం చెయ్యమని కోరినట్లు సమాచారం.
సమాజం మీద సినిమాలు తీసే కృష్ణ వంశీ అయితే తన 100 వ సినిమాకి న్యాయం చేస్తాడని బాలయ్య భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే కృష్ణ వంశీ నీ పిలిచి మంచి మెసేజ్ ఉన్న కథ కావాలని చెప్పాడట. ఈ సినిమా అభిమానులకే కాదు , ప్రేక్షకులకు కూడా బాగా నచ్చేలా ఉండాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతానికి కృష్ణ వంశీ దిల్ రాజు బ్యానర్ లో ఒక భారి బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పుడు సడన్గా బాలయ్య 100 వ సినిమా కి కథ రాయమనగానే కృష్ణ వంశీ సైతం షాక్ అయినట్లు సమాచారం .మరి ఈ కాంబినేషన్ లో సినిమా వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


No comments: