భారి గ్యారేజ్ సెట్ రెడీ అవుతుంది - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 18 February 2016

భారి గ్యారేజ్ సెట్ రెడీ అవుతుంది

భారి గ్యారేజ్ సెట్ రెడీ అవుతుంది


ఎన్టీఆర్ - కొరటాల సినిమా " జనత గ్యారేజ్ " త్వరలో మొదలవ్వబోతుంది. ఈ సినిమా కోసం సారధి స్టూడియోస్ లో ఒక పెద్ద సెట్ వేస్తున్నరన్న సంగతి మనకి తెలిసిందే. ఈ సెట్ గురించి ఆరా తీయగా , చాల విషయాలు తెలిసాయి. సారధి స్టూడియోస్ లో వేస్తుంది గ్యారేజ్ సెట్ అంట. ఈ సెట్ కోసం 20 పాత కార్లను కూడా రెడీ చేసారట.

దాదాపు 3 కోట్ల రూపాయిల తో నిర్మించిన ఈ సెట్ టాలీవుడ్ లో నే అతి ఖరీదైన సెట్ అవుతుందని చిత్రం యూనిట్ చెప్తున్నారు.మార్చ్ 10 లోపు ఈ సెట్ పూర్తి అవుతుందని సమాచారం. ఈ నెల 22 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుండగా , ఎన్టీఆర్ గ్యారేజ్ సెట్ తయారయ్యాక షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.

ఈ సినిమా లో మోహన్ లాల్ ఎన్టీఆర్ కి మావయ్య గా నటిస్తున్నాడు. సాయి కుమార్ తండ్రి పాత్ర చేస్తున్నాడనే విషయం మనకు తెలిసిందే. నిత్య మీనన్ , సమాంత హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు లో విడుదల అవ్వనుంది.
భారి గ్యారేజ్ సెట్ రెడీ అవుతుంది Reviewed by Unknown on 01:26 Rating: 5 ఎన్టీఆర్ - కొరటాల సినిమా " జనత గ్యారేజ్ " త్వరలో మొదలవ్వబోతుంది. ఈ సినిమా కోసం సారధి స్టూడియోస్ లో ఒక పెద్ద సెట్ వేస్తున్నరన్...

No comments: