త్రివిక్రమ్ - సునీల్ స్నేహం గురించి పరిశ్రమ అందరికి తెలిసిందే. ఇండస్ట్రీ కి రాకముందు త్రివిక్రమ్ , సునీల్ ఒకే రూం లో ఉండే వాళ్ళు . ఇద్దరం చాల కస్టపడి పైకి వచ్చాం అని చాల సార్లు పబ్లిక్ గా చెప్పారు. అయితే , ఇక్కడ మీకు తెలియని షాకింగ్ విషయం ఒకటి ఉంది.
త్రివిక్రమ్ , సునీల్ కెరీర్ తొలి రోజుల్లో ,పంజాగుట్ట లోని సాయి బాబా గుడి దగ్గర ఒక రూం లో ఉండే వాళ్ళు. ఈ రూం లో త్రివిక్రమ్ స్టొరీ డిస్కషన్స్ ని ఉపయోగించేవాడు.సునీల్ కూడా ఇదే రూం లో త్రివిక్రమ్ తో ఉండేవాడు. ఇందులో షాకింగ్ ఏముంది అనుకుంటున్నారా ? ఈ రూం ని ఇప్పటికి త్రివిక్రమ్ ఖాళీ చెయ్యలేదట , ఇప్పటికి రెంట్ కడుతూనే ఉంటారట , అప్పుడప్పుడు సునీల్ , త్రివిక్రమ్ ఈ రూం కి వచ్చి కబుర్లు చెప్పుకుంటారని చుట్టూ పక్కల వాళ్ళు చెప్తున్నారు.
ఏది ఏమైనా , ఇంత పెద్ద పొజిషన్ కి వచ్చాక కూడా పాత రూం ని వదల్లెదంటే నిజంగా గొప్ప విషయమే మరి. త్రివిక్రమ్ , సునీల్ స్నేహానికి ఇదొక మచ్చు తునక అని చెప్పాలి.


No comments: