సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరో గా మన ముందుకు రానున్నాడు అనే విషయం మనకు తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో మొదలు అవుతుందని ప్రకటించారు కాని ఇప్పుడు పరిస్థితులు అలా లేకపోవడం గమనార్హం.వివరాల్లోకి వెళితే , దేవి శ్రీ ఇప్పట్లో హీరో గా చేసే మూడ్ లో లేదని ఫిల్మ్ నగర్ సమాచారం.
సుకుమార్ కూడా దేవి మాటని గౌరవించి ప్రస్తుతానికి సినిమా విషయాన్నీ పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి సినిమా తో బిజీ గా ఉన్న చరణ్ తో సుకుమార్ సినిమా చెయ్యడానికి ఇప్పటికే ఒప్పుకున్నాడు. సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలోపు , సుకుమార్ కథ రెడీ చేస్తాడని సమాచారం. రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఈ ఏడాది మొదలయి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి.
మొత్తానికి దేవి శ్రీ ప్రసాద్ హీరో గా డ్రాప్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


No comments: