బాహుబలి 2 వ భాగం షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ అయిపోయాక కేరళ లో ఒక ఫ్రెష్ షెడ్యూల్ ఉంది. ఇప్పటికే బాహుబలి 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి 2 2017 లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే , ఈ సినిమా పాటలను రికార్డు చేసే పని లో ఉన్నాడు కీరవాణి. బాహుబలి కంటే సెన్సేషనల్ గా సాంగ్స్ రావాలని కీరవాణి చాల కష్టపడుతున్నాడు.
ఇందులో భాగంగానే పంజాబీ సింగర్ దలేర్ మెహంది తో ఒక పాట పాడిస్తున్నారు. దలేర్ అంతకు ముందు తొలి సారిగా రాజమౌళి " యమదొంగ " సినిమా లో పాడారు. యమ దొంగ లోని రబ్బరు గాజులు సాంగ్ చాల పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని తెలుగు పాటలు పాడినప్పటికీ, మగధీర సినిమా లో జోర్ సే , బాద్ష లో బంతిపూల జానకి పాటలు చాల పాపులర్ అయ్యాయి. మళ్ళి చాల కాలం తర్వాత దలేర్ మెహంది తెలుగు లో పాట పడనున్నాడు. ఈ పాట హిందీ , తెలుగు వెర్షన్లలో ఉంటుందని సమాచారం.
ఎప్పటి లాగానే ఈ పాట కూడా హిట్ అయ్యి బాహుబలి కి సహాయ పడాలని ఆశిద్దాం.


No comments: