చిరంజీవి 150 సినిమా కి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. 2014 లో సినిమా చేస్తాను అని ప్రకటించిన చిరు , 2016 కి కూడా షూటింగ్ ప్రారంభించలేదు. మద్యలో ఎన్నో కథలు విని , ఆఖరికి కత్తి సినిమా రీమేక్ చెయ్యడానికి ఒప్పుకున్నాడు.వినాయక్ ఈ సినిమా కి దర్శకుడు అయితే , వినాయక్ ఈ మధ్య ఫాం లో లేదు.
అల్లుడు శీను అంతంత మాత్రం ఆడింది , ఇక ఈ మధ్యనే విడుదల అయిన అఖిల్ సినిమా భారి పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ నుండి వినాయక్ ని ఎప్పుడో తపించేవాళ్ళు కాని , వినాయక్ కి ఉన్న అనుభవం ని పరిగణించాడు చిరు.ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలవ్వలేదని తెలుస్తుంది.
తెలుగు కి తగ్గట్లు ఇందులో పలు మార్పులు చెయ్యడానికి చిరంజీవి కొంత మంది సీనియర్ రైటర్స్ కి కబురు పంపినట్లు సమాచారం. పరుచూరి బ్రదర్స్ , చిన్ని కృష్ణ , వక్కంతం వంశీ, లాంటి రైటర్స్ ని పిలిచిస్ క్రిప్ట్ లో మార్పులు చేపిస్తే బాగుంటుందని చిరు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ రైటర్స్ లో కత్తి కి ఎవరు పెడతారో చూడాలి.


No comments: