251 రుపాయిలకే స్మార్ట్ ఫోన్ - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

251 రుపాయిలకే స్మార్ట్ ఫోన్

251 రుపాయిలకే స్మార్ట్ ఫోన్ chepest smart mobile india freedom 251


ఏంటి 251 రూపాయిలకె స్మార్ట్ ఫోన్ హా ? అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే త్వరలో స్మార్ట్ ఫోన్ 251 రూపాయిలకు దొరకనుంది.వివరాల్లోకి వెళితే , మన దేశం లో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువ అయ్యింది , ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం 2000 అయిన పెట్టాల్సిందే.

ఈ విషయాన్నీ మన ప్రభుత్వం దృష్తి లో పెట్టుకుంది. అంతకు ముందు రిలయన్స్ సంస్థ వారు 1500 కె స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించారు కాని దానికంటే ముందే రింగింగ్ బెల్స్ అనే సంస్థ 251 రూపాయిలకే స్మార్ట్ ఫోన్ అందిస్తామని ముందుకు వచ్చింది.దేశం లో సామాన్యుడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలనే ఉద్దేశం తో ఇలా 251 కి అందిస్తున్నామని , ప్రభుత్వం సహకారం బాగుందని రింగింగ్ బెల్స్ సంస్థ వారు ఆనందం వ్యక్తం చేసారు.

ఈ ఫోన్ పేరు " ఫ్రీడమ్ 251" . రింగింగ్ బెల్స్ వారి ఈ 251 రూపాయిల స్మార్ట్ ఫోన్ , ప్రపంచం లోనే అత్యంత చౌక ఫోన్ గా రికార్డు కి ఎక్కనుంది. ఈ నెల 17 ఈ ఫోన్ ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ చేతుల మీద ఆవిష్కరించనున్నారు. రింగింగ్ బెల్స్ వారు ఇప్పటికే కొత్త 4జి మొబైల్ ని మార్కెట్ లోకి విడుదల చేసారు. ఈ 4జి స్మార్ట్ ఫోన్ వేల కేవలం 2,999 అవ్వడం విశేషం.ఏది ఏమైనా సామాన్యుడి చేతికి ఇంత తక్కువలో ఫోన్ రావడం నిజంగా శుభ పరిణామం అని చెప్పాలి.
251 రుపాయిలకే స్మార్ట్ ఫోన్ Reviewed by Unknown on 21:43 Rating: 5 ఏంటి 251 రూపాయిలకె స్మార్ట్ ఫోన్ హా ? అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే త్వరలో స్మార్ట్ ఫోన్ 251 రూపాయిలకు దొరకనుంది.వివరాల్లో...

No comments: