ఒకే నెలలో ఆ హీరోవి రెండు సినిమాలు విడుదల - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 25 February 2016

ఒకే నెలలో ఆ హీరోవి రెండు సినిమాలు విడుదల

ఒకే నెలలో ఆ హీరోవి రెండు సినిమాలు విడుదల


మన టాలీవుడ్ లో ఏ హీరో అయిన ఒక సినిమా విడుదల అయ్యాక ఇంకో సినిమా రావడానికి కనీసం 4 నెలలు గ్యాప్ ఆయన పడుతుంది. కాని ఒక్కోసారి టైం బాలేకపోతే , ఒకే నెలలో రెండు సినిమాలు చూడాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి ఒకప్పుడు బాలయ్య , నాగార్జున కి ఎదురయ్యింది.

షూటింగ్ పూర్తి చేసుకొని కొన్ని కారణాల వాళ్ళ రిలీజ్ ఆగిపోయిన సినిమాలు ఒకేసారి విడుదల కు సిద్ధం అవుతుంటాయి , అలాంటప్పుడే ఇటువంటివి సాధ్యం. తాజా గా నాని రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యాయి. ఇప్పుడు ఒకే నెలలో రెండు సినిమాలతో వస్తున్నాడు మంచు మనోజ్. కరెంటు తీగ తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ , రామ్ గోపాల్ వర్మ ఎటాక్ సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా జరిగి డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది కాని విడుదలకి నోచుకోలేదు. 

ఇదే గ్యాప్ లో మనోజ్ దశరథ్ తో " శౌర్య " అనే సినిమా చేసాడు. ప్రస్తుతానికి శౌర్య మార్చ్ 4 న విడుదల కి ఫిక్స్ అయ్యింది. ఇంకో వైపు మనోజ్ ఆగిపోయిన ఎటాక్ సినిమాని మార్చ్ 18 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే ఒకే నెలలో మనోజ్ రెండు సినిమాలతో మనల్ని అలరిస్తున్నాడు అనమాట. రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.
ఒకే నెలలో ఆ హీరోవి రెండు సినిమాలు విడుదల Reviewed by Unknown on 08:13 Rating: 5 మన టాలీవుడ్ లో ఏ హీరో అయిన ఒక సినిమా విడుదల అయ్యాక ఇంకో సినిమా రావడానికి కనీసం 4 నెలలు గ్యాప్ ఆయన పడుతుంది. కాని ఒక్కోసారి టైం బాలేకపో...

No comments: