రాకుల్ ప్రీత్ , త్రాప్సీ , ప్రియమణి లను ఫాలో అవుతుంది తమన్నా. వివరాల్లోకి వెళితే మన టాలీవుడ్ లో హీరోయిన్లు అందరు ఉత్తరాది వారే , కొంత మంది దక్షిణాది అయిన సరే తెలుగు భాష మాత్రం రాదు. చాల మంది హీరోయిన్లకు సింగర్లు డబ్బింగ్ చెప్తుంటారు. ఈ సంప్రదాయం గత 10 ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది.అయితే , కొంత మంది హీరోయిన్లు మాత్రం కొంచెం తెలుగు అర్ధం అవ్వగానే డబ్బింగ్ చెప్పడానికి ముందుకు వస్తుంటారు.
ఇలా డబ్బింగ్ చెప్పిన తొలి హీరోయిన్ ప్రియమణి. గోలీమార్ సినిమా లో ప్రియమణి తన సొంత డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత తాప్సీ కూడా మొగుడు సినిమాలో సొంత గొంతు ఉపయోగించింది. ఇక ఈ మధ్యనే టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాకుల్ కూడా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో సొంత డబ్బింగ్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాకుల్ నీ చూసి తమన్నా ఇంప్రెస్స్ అయిందో ఏమో కాని ఊపిరి సినిమాలో తనే డబ్బింగ్ చెప్పుకుంటాను అని ప్రకటించింది తమన్నా.
ఇప్పుడున్న హీరోయిన్లలో తమన్నా మాట్లాడినట్లు తెలుగు ఎవరు మాట్లాడలేరు అనేది నిజం. ఈ ఒక్క పాయింట్ మీద చూసుకుంటే తమన్నా డబ్బింగ్ చెప్పడం లో తప్పేమీ లేదు అనిపిస్తుంది. ఏది ఏమైనా తమన్నా డబ్బింగ్ ఇంకా వేరే హీరోయిన్లకు కూడా స్ఫూర్తి అవుతుందని ఆశిద్దాం.


No comments: