నాగార్జున గురించి పరిశ్రమలో ప్రతి ఒక్కరు చాల గొప్పగా మాట్లాడుకుంటారు. గొడవలు , రాజకీయాలకు దూరంగా ఉండే నాగార్జున అంటే చాల మంది హీరోలకు ఇష్టం. నాగార్జునకి మిస్టర్ కూల్ అనే బిరుదు కూడా ఉంది. అయితే , ఈ మధ్య నాగార్జున చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం అయ్యింది.
వివరాల్లోకి వెళితే , ఇటివల నాగార్జున ప్రెస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా , సోగ్గాడే చిన్ని నాయన సక్సెస్ గురించి మాట్లాడుతూ , తాము 20 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసి 50 కోట్ల వరకు సాధించామని , ఇది అతి పెద్ద విజయం అని చెప్పుకొచ్చాడు. 50 కోట్లతో సినిమా చేసి 50 కోట్లు కలెక్ట్ చెయ్యడం లో ఏముందని కూడా అనడం చర్చనియంశం అయ్యింది. సంక్రాంతికి నాగార్జున సినిమా తో పాటు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా 53 కోట్లను వసూలు చేసింది. నాగార్జున పరోక్షంగా ఎన్టీఆర్ సినిమా మీద పంచ్ వేసాడని ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నాగార్జున సినిమా ఫ్లాప్ అయ్యుంటే 20 లో సగం కూడా వచ్చేది కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదించడం విశేషం.
ఏది ఏమైనా నాగార్జున ఈ వ్య్ఖ్యలు చేసి ఉండకుడదు అంటున్నారు విశ్లేషకులు , ఎందుకంటే నాగార్జున అఖిల్ సినిమా మీద 45 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించాడు కాని 20 కోట్లు కూడా వసూలు చెయ్యలేదు. ఫ్లాప్ వచ్చినపుడు కామ్ గా ఉంది హిట్ వచ్చినప్పుడు ఇలా విమర్శించడం ఎంతైనా విచిత్రంగానే ఉంటది.


No comments: