కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఫ్లాప్ అయ్యిందా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 27 February 2016

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఫ్లాప్ అయ్యిందా ?

14 రీల్స్ పతాకం పైన , నాని నటించిన సినిమా " కృష్ణ గాడి వీర ప్రేమ" . ఈ సినిమా విడుదల అయ్యి 3 వారాలు అవుతుంది. ఈ సినిమాకి 14 రీల్స్ వారు చాల భారి ఎత్తున పబ్లిసిటి ఇచ్చారు. సినిమా టాక్ కూడా బాగుంది కాని అనుకున్నంత లో వసూళ్ళు లేవని బాక్స్ ఆఫీసు పండితులు అంటున్నారు.

 భలే భలే మగాడివోయ్ సినిమా ప్రభావం వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కాని తర్వాత చాల మాములు గా వసూళ్ళు వచ్చాయని బయ్యర్లు సైతం చెప్పుకుంటున్నారు. అస్సలు ఈ సినిమా హిట్టా ? లేకపోతే ఫ్లాప అనేది ఎవరికీ తెలియదు.వివరాల్లోకి వెళితే , ఈ సినిమాని 14 కోట్ల బడ్జెట్ లో నిమించారు నిర్మాతలు. ఇందులో 2 కోట్ల వరకు పబ్లిసిటి అయ్యింది .

 అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను అభిషేక్ పిక్చర్స్ వారు 9 కోట్లకు కొన్నారు . ఓవర్సీస్ , రెస్త్ అఫ్ ఇండియా , శాటిలైట్ ఇలా మిగిలిన హక్కులన్నిటికి కలిపి 7 కోట్ల వరకు వచ్చిందట. అంటే నిర్మాతలకు 2 కోట్ల ప్రాఫిట్ అనమాట. అయితే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో అనుకున్నంతగా వసూళ్ళు రాబట్టలేదు. బయ్యర్ల సమాచారం వరకు సినిమా 10 % లాస్ లోనే ముగుస్తుంది. ఇక ఈ లెక్కలన్నీ చూసుకుంటే , కృష్ణ గాడి వీర ప్రేమ సినిమా నాని కెరీర్ లో ఇంకో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఫ్లాప్ అయ్యిందా ? Reviewed by Unknown on 23:59 Rating: 5 14 రీల్స్ పతాకం పైన , నాని నటించిన సినిమా " కృష్ణ గాడి వీర ప్రేమ" . ఈ సినిమా విడుదల అయ్యి 3 వారాలు అవుతుంది. ఈ సినిమాకి 14 రీల్...

No comments: