ఎన్టీఆర్ కొత్త చిత్రం జనత గ్యారేజ్ షూటింగ్ ఇప్పటకే మొదలయ్యింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ లో ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత మార్చ్ 7 న ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ ఉంది.ఈ సాంగ్ కి రాజ సుందరం కోరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇంత వరకు బానే ఉంది కాని ఎన్టీఆర్ విషయం లో కొరటాల కి కష్టాలు మొదలయ్యాయి.
నాన్నకు ప్రేమతో సినిమా లో ఎన్టీఆర్ సరికొత్త హరి స్టైల్ , గడ్డం తో అందరికి షాక్ ఇచ్చాడు. యూత్ అంత నాన్నకు ప్రేమతో హెయిర్ స్టైల్ ని గట్టిగా ట్రై చేసారు. ఒక విషంగా చెప్పాలంటే ఎన్టీఆర్ సరి కొత్త లుక్ సినిమా కి బాగా కలిసి వచ్చింది. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ బాగా మనసులోకి ఎక్కించుకున్నాడు. జనత గ్యారేజ్ సినిమా లో కూడా ఎన్టీఆర్ తన హెయిర్ స్టైల్ కొత్తగా ఉండాలని కొరటాల ను కోరాడట.
ఎన్టీఆర్ ని కొట్టగా ఎలా చూపించాలి అనే విషయం మీద కొరటాల తన టీం తో కూర్చొని చాల పెద్ద డిస్కషన్ పెట్టినట్లు తెలుస్తుంది. కొరటాల శాంపిల్ గా నాలుగు ఐదు హెయిర్ స్టైల్స్ ఎన్టీఆర్ కి చూపించాడట , అయిన సరే ఎన్టీఆర్ కి పెద్దగా నచ్చట్లేదని సమాచారం. షూటింగ్ ఇంకా వారం ఉంది , కొరటాల మాత్రం ఎన్టీఆర్ గెట్ అప్ ని సెట్ చెయ్యలేదు. మరి కొరటాల కి ఈ కష్టాలు ఎప్పుడు తీరుతుందో చూద్దాం.


No comments: