జనత గ్యారేజ్ లో గోల చేయనున్న ఎన్టీఆర్ - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 27 February 2016

జనత గ్యారేజ్ లో గోల చేయనున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి ఊపు మీద ఉన్న యంగ్ టైగర్ , జనత గ్యారేజ్ లో గోల చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలయింది. మోహన్ లాల్ , సstudentమంత మరియు మిగతా తారాగణం మీద ముఖ్యమైన సన్నివేశాలు తీస్తున్నారు. మార్చ్ 7 నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

మార్చ్ 7 నా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పాట షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ రాజ సుందరం మంచి స్టెప్స్ ని కంపోజ్ చేసి పెట్టాడట. అప్పుడెప్పుడో కంత్రి సినిమా ఇంట్రడక్షన్ కి కూడా రాజ సుందరమే కంపోజ్ చేసాడు , ఈసారి స్టెప్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని చిత్ర వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా కోసం 4 కోట్ల ఖరీదు అయిన జనత గ్యారేజ్ సెట్ ని సారధి స్టూడియోస్ లో నిర్మించారు.

 ఇందులో ఎన్టీఆర్ ఐ ఐ టి స్టూడెంట్ గా కనిపించనున్నాడు. సమాంత , నిత్య మీనన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా , మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ని కృష్ణ పుష్కరాల సందర్భంగా ఆగష్టు 12 నా విడుదల చేయనున్నారు.
జనత గ్యారేజ్ లో గోల చేయనున్న ఎన్టీఆర్ Reviewed by Unknown on 00:37 Rating: 5 ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి ఊపు మీద ఉన్న యంగ్ టైగర్ , జనత గ్యారేజ్ లో గోల చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూ...

No comments: