ఐఐటి స్టూడెంట్ గా ఎన్టీఆర్ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

ఐఐటి స్టూడెంట్ గా ఎన్టీఆర్

 ఐఐటి స్టూడెంట్ గా ఎన్టీఆర్


ఎన్టీఆర్ మరొకసారి విద్యార్ధి పాత్ర వేయనున్నడా ? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ గతం లో చాల సినిమాల్లో స్టూడెంట్ పాత్ర చేసాడు. స్టూడెంట్ నెంబర్ 1 , సుబ్బు , నాగ , ఆడి లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ స్టూడెంట్ గా నటించి మెప్పించాడు.

యమదొంగ తర్వాత సన్నబడ్డ ఎన్టీఆర్ ఎప్పుడు స్టూడెంట్ పాత్రలు చెయ్యలేదు. ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర భారి ఫ్లాప్ గా నిలిచింది.ఇప్పుడు మళ్ళి ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్ ఐ ఐ టి స్టూడెంట్ గా కనిప్సితదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి.

 ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యినప్పటికి , ఎన్టీఆర్ మాత్రం మార్చ్ మొదటి వారం లో షూటింగ్ కి వస్తున్నాడు. ఈ సినిమా కోసం గ్యారేజ్ సెట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఆగష్టు 12 న విడుదల అవ్వనున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి.
ఐఐటి స్టూడెంట్ గా ఎన్టీఆర్ Reviewed by Unknown on 07:53 Rating: 5 ఎన్టీఆర్ మరొకసారి విద్యార్ధి పాత్ర వేయనున్నడా ? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ గతం లో చాల సినిమాల్ల...

No comments: