పవన్ కోసం బన్నీ త్యాగం ? - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

పవన్ కోసం బన్నీ త్యాగం ?

పవన్ కోసం బన్నీ త్యాగం ?


మెగా ఫ్యామిలి లో కస్టపడి పైకి వచ్చిన యువ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ కి చిరంజీవి , పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ సినిమాల్లో ఎప్పుడు చిరు , పవన్ కళ్యాణ్ పేర్లు ఒక్కసారి అయిన వినపడల్సిందే. చిరు ఫ్యామిలి మీద అంత ప్రేమ చూపించే బన్నీ , అనుకోకుండా రుద్రమ దేవి సినిమా తో చిరు సినిమా దగ్గరలో విడుదలకి రావాల్సి వచ్చింది.

ఇప్పుడు సరిగ్గా సరైనోడు విషయం లో అలాగే జరిగే అవకాశం ఉంది కాని ఈసారి మెగా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకున్న అల్లు ఫ్యామిలి , సరైనోడు సినిమా ని సర్దార్ గబ్బర్ సింగ్ దగ్గరలో విడుదల చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8 న విడుదల అవ్వాల్సి ఉంది , అదే రోజు బన్నీ పుట్టిన రోజు అవ్వడం విశేషం.

 బన్నీ సినిమా ఆరోజు విడుదల అయితేనే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇంకో వైపు సరైనోడు సినిమా సర్దార్ సినిమా బట్టే వస్తుందన్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 21 న సరైనోడు సినిమా విడుదల చేస్తే బాగుంటుందని బోయపాటి కూడా సూచించినట్లు సమాచారం. మొత్తానికి బన్నీ పవన్ కోసం త్యాగం చేసాడు.
పవన్ కోసం బన్నీ త్యాగం ? Reviewed by Unknown on 07:54 Rating: 5 మెగా ఫ్యామిలి లో కస్టపడి పైకి వచ్చిన యువ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ కి చిరంజీవి , పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా...

No comments: