సర్దార్ లో కూడా అంత్యాక్షరి ఉందా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 16 February 2016

సర్దార్ లో కూడా అంత్యాక్షరి ఉందా ?

Sardar Movie Gabbarsingh 2

పవన్ కళ్యాణ్ కెరీర్ చాల డౌన్ లో ఉన్నపుడు వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. బాక్స్ ఆఫీసు దగ్గర భారి రికార్డులను తిరగ రాసింది గబ్బర్ సింగ్. అయితే , ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ నటన తో పాటు ఇంకో సీన్ హైలైట్ అయ్యింది.

ద్వితియార్ధం లో వచ్చే అంత్యాక్షరి సీన్ కి జనాలు బ్రహ్మరధం పట్టారు. సినిమా ని మళ్ళి మళ్ళి చూడటానికి అంత్యాక్షరి సీన్ చాల దోహదపడింది అని చెప్పాలి. అయితే , ఈ సినిమా కి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ మన ముందుకు రాబోతుంది. ఇప్పటికి 60 % శోటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సీక్వెల్ ని సంపత్ నంది డైరెక్ట్ చెయ్యల్సింది కాని కొన్ని కారణాల వాళ్ళ అది పవర్ దర్శకుడు బాబీ కి వెళ్ళింది.

ఈ సినిమా విషయం లో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. కెమెరా మాన్ , హీరోయిన్ , డైరెక్టర్ ఇలా అందరు మారుతూ వచ్చారు. అయితే , ఇందులో అంత్యాక్షరి లాంటి సీన్ ఉంటె బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ అభిప్రయపడ్డాడట. ఈ విషయం మీద ఇప్పటికే ఒక చిన్న స్టొరీ సిట్టింగ్ లాంటిడ్ జరిగిందని టాక్. అంత్యాక్షరి సీన్ కి రెండు మెట్లు ఎక్కువ ఉండేలా సీన్స్ రాయమని పవర్ స్టార్ ఆర్డర్ చేసాడని సమాచారం.మరి ఈ సీన్ అంత్యాక్షరి సీన్ ని మించి ఉంటుందా లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.
సర్దార్ లో కూడా అంత్యాక్షరి ఉందా ? Reviewed by Unknown on 01:41 Rating: 5 పవన్ కళ్యాణ్ కెరీర్ చాల డౌన్ లో ఉన్నపుడు వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. బాక్స్ ఆఫీసు దగ్గర భారి రికార్డులను తిరగ రాసింది గబ్బర్ సింగ్. అయిత...

No comments: