తెలుగు లో దర్శకుడిగా అడుగు పెట్టి మ హీరో గా ట్రై చేసి , చిన్న చిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. రన్ రాజ రన్ , బాహుబలి మంచి పాత్రలు చేసి టాలీవుడ్ లో పాతుకుపోయాడు. కిస్ సినిమా తో హీరో గా ట్రై చేసి ఫెయిల్ అయిన అడవి శేష్ తాజాగా క్షణం అనే సినిమా చేసాడు.
క్షణం సినిమా తొలి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ సినిమా కథ , ట్విస్టులు చూసి చాల మంది షాక్ అయ్యారు. కేవలం కోటి రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా శాటిలైట్ హక్కులతో కలిపి 10 కోట్ల వరకు వసూలు చేసే అవకశం ఉంది. అయితే , ఈ సినిమా చుసిన ప్రముఖ బాలీవుడ్ సంస్థ రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం
. దర్శకుడు రవి కాంత్ ని పిలిచి రీమేక్ గురించి చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఒక వేళ రీమేక్ చేస్తే ,హిందీ లో హీరో గా ఆడవి శేష్ ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాహుబలి సినిమా తో ఆడవి శేష్ బాలీవుడ్ లో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు.


No comments: