తెలంగాణ ముఖ్య మంత్రి కే సి అర్ మనవడు , కే టి అర్ కొడుకు "హిమన్షు" త్వరలో ఒక షార్ట్ ఫిల్మ్ లో హీరో గా నటిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే , హిమన్షు కే సి అర్ కి చాల ఇష్టమైన మనవడు. తాత గారి తో చాల ఎక్కువ సమయం గడిపే హిమన్షు, చిన్న వాడిన మంచి మాటకారి .
గతం లో ఖైరతాబాద్ గణేశుడు దగ్గర హిమన్షు మాట్లాడిన విధానం చూసి అందరు షాక్ అయ్యారు. తాత , తండ్రి లాగ పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడని అందరు భావించారు ఇటివల నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు సూపర్ హార్ట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ షార్ట్ ఫిల్మ్ లో హిమన్షు ని హీరో గా తీసుకుంటే బాగుంటుందని భావించారట. ఈ విషయం మీద కే టి అర్ ని కూడా కలిసినట్లు సమాచారం.
కే టి అర్ మాత్రం కొడుకుని హీరో గా చెయ్యడానికి పెద్దగా ఆసక్తి గా లేదని సమాచారం. ఈ విషయం మీద కే సి అర్ నిర్ణయమే ఫైనల్ అని అంటున్నారు సన్నిహితులు. అన్ని కుదిరితే హిమన్షు ని హీరో గా చూడొచ్చు అనమాట. ఇప్పటికే ఈ విషయం మీద టి అర్ ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


No comments: