నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ ఇచ్చిన ఊపు తో కెరీర్ మీద మళ్ళి ఆశలు పెంచుకున్నాడు.షేర్ సినిమా నిరాశపరిచిన ఆ సినిమా అపజయం ముందే ఉహించినదె. ఇవన్ని పక్కన పెడితే , కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం పూరి తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఉంటుందని ప్రకటించాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా పూరి తో చేస్తాడని ప్రెస్ కి తెలిపారు. ప్రస్తుతానికి పూరి కన్నడ ఫిల్మ్ " రోగ్" నే పూర్తి చేసే పని లో ఉన్నాడు.ఇషాన్ అనే కొత్త హీరో ని పరిచయం చేస్తున్న పూరి , ఇంకో సైడ్ కళ్యాణ్ రామ్ సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడని వినికిడి.ఈ సినిమా లో కళ్యాణ రామ్ జర్నలిస్ట్ పాత్రను చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా పూరి సినిమా కెమెరా మాన్ గంగతో రామ్ బాబు లో జర్నలిస్ట్ పాత్ర చేసాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అలంటి కథ నే చేస్తుండటం విశేషం.పటాస్ లాగ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.


No comments: