రెండు వరుస విజయాలతో దూసుకుపోతున్న హిట్ యాంకర్ అనసూయ ఇంకో సినిమాలో కనిపించనుంది. వివర్ల్లోకి వెళితే , రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో " ధ్రువ " సినిమా ఇటివలే షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ " తని ఒరువన్ " కి రీమేక్
.రాకుల్ ప్రీత్ చరణ్ సరసన మరోసారి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే, ఈ సినిమా లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనసూయ ని తీసుకోవాలని సురేందర్ రెడ్డి అనుకుంటున్నాడట. ఈ విషయం మీద అనసూయ ని కలవడం ఒప్పుకోడం కూడా చక చక జరిగిపోయినట్లు సమాచారం.
తెలుగు వెర్షన్ లో కూడా విలన్ గా అరవింద్ స్వామి నటిస్తున్నాడు.అరవింద్ స్వామి లవర్ గా అనసూయ నటించే అవకశం ఉంది. మొత్తానికి అనసూయ పెద్ద సినిమా లో ఛాన్స్ కొట్టేసి కెరీర్ లో మంచి టర్నింగ్ పాయింట్ తెచ్చుకుంది అంటున్నారు సిని విశ్లేషకులు.


No comments: