వరుణ్ తేజ్ కు దెబ్బ మీద దెబ్బ - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 1 March 2016

వరుణ్ తేజ్ కు దెబ్బ మీద దెబ్బ

వరుణ్ తేజ్ దెబ్బ మీద దెబ్బ పడుతూ వస్తుంది. మొన్నటికి మొన్న క్రిష్ దర్శకత్వంలో రాయభారి అనే సినిమా సైన్ చేసాడు , ఆ సినిమా మొదలవ్వకముందే ఆగిపోయింది. భారి బడ్జెట్ వల్లే సినిమా ఆగిపోయిందని వదంతులు వినిపించాయి.ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా సైన్ చేసాడు వరుణ్ తేజ్.

 తాజాగా శ్రీను వైట్ల సినిమా కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కి సి కళ్యాణ్ నిర్మాతగా ఉంటానని మాట ఇచ్చాడు కాని తాజా పరిణామాలు చూస్తుంటే సి కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.శ్రీను వైట్ల మీద రిస్క్ చేయలేనని కావాలంటే ఎవరైనా హిట్ దర్శకుడు అయితే ప్రొడ్యూస్ చేస్తానని సి కళ్యాణ్ చెప్పాడట. వరుణ్ కూడా ఈ విషయం మీద ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

 ఇంకో వైపు ఠాగూర్ మధు , ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా వైట్ల సినిమా ని నిర్మించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇదే నిజం అయితే , వరుణ్ - వైట్ల సినిమా ఓకే అయిపోయినట్లే . ఇప్పటికే ఈ ఇద్దరు నిర్మాతలు సాయి ధరం తేజ్ - గోపీచంద్ మలినేని సినిమాలను నిర్మిస్తున్నారు.
వరుణ్ తేజ్ కు దెబ్బ మీద దెబ్బ Reviewed by Unknown on 04:10 Rating: 5 వరుణ్ తేజ్ దెబ్బ మీద దెబ్బ పడుతూ వస్తుంది. మొన్నటికి మొన్న క్రిష్ దర్శకత్వంలో రాయభారి అనే సినిమా సైన్ చేసాడు , ఆ సినిమా మొదలవ్వకముందే ఆగి...

No comments: