కొత్త చిక్కుల్లో అల్లు అర్జున్ ? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 2 March 2016

కొత్త చిక్కుల్లో అల్లు అర్జున్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిక్కుల్లో పడ్డాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అంటే అల్లు అర్జున్ అని చెప్పాలి. స్టైలిష్ స్టార్ తో సినిమా చేస్తే మినిమం అవుట్ పుట్ ఉంటుందని , నిర్మాతలు , దర్శకులు ఫీల్ అవుతుంటారు. అల్లు అర్జున్ కూడా స్క్రిప్ట్ విషయం లో చాల జగ్రాతాగా ఉంటాడు ఎందుకంటే , అల్లు కి సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడున్న హీరో లందరి లో సక్సెస్ రేట్ బాగా మైంటైన్ చేసేది కూడా అల్లు అర్జున్ మాత్రమె.

మీ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే కథలన్నీ వింటాడు బన్నీ. గత ఏడాది తమిళ్ దర్శకుడు లింగు స్వామి చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పాడు బన్నీ. అదే విధంగా మన దర్శకుడు విక్రం కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి లింగుస్వామి తో సినిమా ఈ ఏడాది చివర్లో ఉండాలి కాని లింగుస్వామి బన్నీ కోసం విశాల పందెం కోడి 2 ని క్యాన్సిల్ చేసుకున్నాడు. సరైనోడు అయిపోగానే తనతోనే సినిమా చెయ్యాలని ఇప్పటికే బన్నీ ని రిక్వెస్ట్ చేసాడు లింగుస్వామి.

ఇంకో వైపు విక్రం కుమార్ మే నుండి అల్లు తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇద్దరిట్లో ఎవరికీ హ్యాండ్ ఇవ్వాలో బన్నీ కి అర్ధం కావట్లేదట. ఈ ఇద్దరు దర్శకులు , తెలుగు , తమిళ్ లో ఒకేసారి సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఉండటం విశేషం.
కొత్త చిక్కుల్లో అల్లు అర్జున్ ? Reviewed by Unknown on 22:56 Rating: 5 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిక్కుల్లో పడ్డాడు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అంటే అల్లు అర్జున్ అని చెప్పాలి. స్టైలిష్ స్టార్ ...

No comments: