సుకుమార్ బాటలో వినాయక్ ? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 2 March 2016

సుకుమార్ బాటలో వినాయక్ ?

మాస్ దర్శకుడు వినాయక్ , సరి కొత్త ఆలోచనలో ఉన్నాడు. అఖిల్ లాంటి ఫ్లాప్ తర్వాత వినాయక్ మీద చాల పూకర్లు వచ్చాయి. అఖిల్ నష్టాలను వినాయక్ భారతి చేసాడని , డబ్బులు వెనక్కి ఇచ్చాడని కొంత మంది ప్రచారం చేసారు. ఆ తర్వాత వినాయక్ అప్పులు ఎక్కువ అయి ఇల్లు అమ్ముకున్నాడని వార్తలు వచ్చాయి కాని ఇవేం నిజం కాదని సమాచారం.

వినాయక్ అప్పుల కోసం ఇల్లు అమ్మలేదట , ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని మొదలు పెట్టడానికి అమ్మినట్లు తెలుస్తుంది.దాదాపు 20 కోట్ల రూపాయిలతో రెండు చిన్న సినిమాలు నిర్మించే ఆలోచనలో వినాయక్ ఉన్నట్లు సమాచారం. సుకుమార్ లాగ కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే వినాయక్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని మొదలు పెడుతున్నాడు.

నిజానికి వినాయక్ కి డబ్బుల బెడద ఎం లేదని సన్నిహితులు అంటున్నారు. చిరంజీవి 150 వ సినిమా డైరెక్ట్ చేస్తున్న వినాయక్ , ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. 150 సినిమా మొదలవ్వగానే తన ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రకటించే అవకాశం ఉంది.
సుకుమార్ బాటలో వినాయక్ ? Reviewed by Unknown on 23:10 Rating: 5 మాస్ దర్శకుడు వినాయక్ , సరి కొత్త ఆలోచనలో ఉన్నాడు. అఖిల్ లాంటి ఫ్లాప్ తర్వాత వినాయక్ మీద చాల పూకర్లు వచ్చాయి. అఖిల్ నష్టాలను వినాయక్ భారత...

No comments: