త్రివిక్రమ్ కి తల నొప్పి తెప్పిస్తున్న స్టార్ హీరోలు - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 2 March 2016

త్రివిక్రమ్ కి తల నొప్పి తెప్పిస్తున్న స్టార్ హీరోలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి పెద్ద తల నొప్పి వచ్చి పడింది. మొన్నటి వరకు మనశ్శాంతి గా ఉన్న త్రివిక్రమ్ కి ఇప్పుడు స్టార్ హీరోల ఫోన్ కాల్స్ తో పిచ్చేక్కిపోతుందట. వివరాల్లోకి వెళితే , త్రివిక్రమ్ సన్ అఫ్ సత్యమూర్తి సినిమా చేసాక కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు.ఆ సమయం ఓ ఎన్టీఆర్ , మహేష్ , చరణ్ , చైతు లాంటి వారితో సినిమా చేద్దాం అనుకున్నాడు కాని చాల మంది హ్యాండ్ ఇచ్చేసారు.

స్టార్ హీరోలతో పని అవ్వదు అని భావించిన త్రివిక్రమ్ , నితిన్ తో సినిమా మొదలెట్టాడు. ఈ సినిమా ఇప్పుడు అయిపోయే దశ కి వచ్చింది.త్రివిక్రమ్ తదుపరి సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , త్రివిక్రమ్ సూర్య తో సినిమా చేసే అవకాశం ఉంది. అయితే , సూర్య కి ముందు తమతో ఒక ప్రాజెక్ట్ చెయ్యాలని ఇద్దరు ముగ్గురు హీరోలు ఫోన్ కాల్స్ తో చంపుతున్నారట.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని బాగా ప్రయత్నిస్తున్నారు.ఇంకో వైపు నాగార్జున అఖిల్ తో ఒక సినిమా చెయ్యాలని అడిగాడట. అస్సలు ఏ హీరో తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్ కి తల నొప్పి తెప్పిస్తున్న స్టార్ హీరోలు Reviewed by Unknown on 05:08 Rating: 5 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి పెద్ద తల నొప్పి వచ్చి పడింది. మొన్నటి వరకు మనశ్శాంతి గా ఉన్న త్రివిక్రమ్ కి ఇప్పుడు స్టార్ హీరోల ఫోన్ కాల...

No comments: